శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 03:06:53

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

  • కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శికి సీఎస్‌ వివరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టామని కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం రాజీవ్‌గౌబా ఢిల్లీ నుంచి తొమ్మిది రాష్ర్టాల సీఎస్‌లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ రాష్ట్రంలో వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని, పాజిటివ్‌ వచ్చినవారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. వైద్యం కోసం 10 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.


logo