ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 14:17:02

వచ్చే దసరా నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి

వచ్చే దసరా నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి

వరంగల్ అర్బన్ : రాష్ర్టంలో 15 లక్షల మంది రైతులకు 7,500 కోట్ల రైతుబంధు సహాయం నేటి నుంచే బ్యాంకులో జమ అవుతున్నాయని రాష్ట్ర రైతు బంధుసమితి ఆధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ధర్మసాగర్ మండలం రాయగూడెం గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే దసరా పండుగ నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. గతంలో ప్రాజెక్టులు నిర్మించాలంటే 30-40 ఏండ్ల సమయం పట్టేది. అది కూడా పూర్తవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉండేదన్నారు. కానీ, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం మూడు, నాలుగేళ్ల తక్కువ సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.


logo