మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 15:57:02

సాగు నీరు అందించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు

సాగు నీరు అందించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు

యాదాద్రి భువనగిరి : సబ్బండ వర్ణాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అంబాల గ్రామంలో బిక్కు వాగుపై చెక్ డ్యాం పనులను జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాగు, సాగు నీటి కోసం ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టిందన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ, సాగునీరు అందించి రైతు పక్షపాతిగా చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోయారని అన్నారు. 


logo