శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 22:39:09

హెల్మెట్‌ ఉంటే ఆమె బతికేది: సీపీ అంజనీకుమార్‌ ట్విట్‌

హెల్మెట్‌ ఉంటే ఆమె బతికేది: సీపీ అంజనీకుమార్‌ ట్విట్‌

హైదరాబాద్ : కుటుంబ సభ్యుల కూడా హెల్మెటు కొనాలని సీపీ అంజనీకుమార్‌ ట్విట్‌ చేశారు.  సంతోష్‌నగర్‌ ఠాణా పరిధిలో స్వరూపరాణి అనే మహిళ ద్విచక్రవాహనం వెనుక కూర్చొన్ని వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడింది, తలకు గాయం అవ్వడంతో ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు, కాగా ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ ఘటన ఎంతో బాధకల్గించిందని, హెల్మెట్‌ ఉండి ఉంటే ఆమె బతికేందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను గుర్తు చేస్తూ బైక్‌ వెనుకాల కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్‌ ధరించాలని ప్రజలకు సూచించారు. కుటుంబంలో ఉండే మహిళల కోసం ఈ రోజే హెల్మెట్‌ కొనండంటూ ఆయన ట్విట్‌లో పేర్కొన్నారు.

పోలీసులు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి: సీపీ అంజనీకుమార్‌ 

విధి నిర్వాహణలో ఉండే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని కరోనా వ్యాధిని దరిచేరకుండా చూసుకోవాలని, ఇది మనకు పరీక్ష సమయమని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ట్విట్‌ చేశారు. మనం ఆరోగ్యం ఉంటేనే సమాజానికి మంచి సేవలు అందించగలమన్నారు. ప్రతి నిమిషం పోలీస్‌ ప్రజల  కోసం పనిచేస్తున్న పోలీసులు వారి ఆరోగ్యం గూర్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


logo