బుధవారం 08 జూలై 2020
Telangana - May 29, 2020 , 05:38:46

ఎంజీబీఎస్‌కు బస్సుల రాకపోకలు ప్రారంభం

ఎంజీబీఎస్‌కు బస్సుల రాకపోకలు ప్రారంభం

హైదరాబాద్   : నగరంలోని మహాత్మాగాంధీ బస్టాండ్‌ (ఎంజీబీఎస్‌)వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు. 67 రోజుల తర్వాత ఎంజీబీఎస్‌ నుంచి  1800 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు కొనసాగించాయి. ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కే. చంద్ర శేఖర్‌రావు బుధవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్టీసీ అధికారుల విన్నపాలను పరిగణలోకి తీసుకొని గురువారం నుంచి రాష్ట్రంలోని (గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహాయించి) అన్ని జిల్లాల నుంచి వస్తున్న బస్సులను ఎంజీబీఎస్‌కు అనుమతించారు.

 సీఎం ప్రకటనతో ఎంజీబీఎస్‌కు అన్ని జిల్లాల నుంచి బస్సులు రాకపోకలు ప్రారంభించాయి.  ఇదిలా ఉండగా..రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను మే 15 నుంచే ప్రారంభించారు. అయితే జిల్లాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన బస్సులను శివారుల్లోని  జేబీఎస్‌, ఉప్పల్‌ ఎక్స్‌రోడ్‌, హయత్‌నగర్‌, అప్పా జంక్షన్‌, ఆరాంఘర్‌ వరకు మాత్రమే అనుమతించారు. దీనితో ఎంజీబీఎస్‌కు వరకు బస్సులు రాలేదు. సీఎం బుధవారం తీసుకున్న తాజా నిర్ణయంతో గురువారం నుంచి ఆర్టీసీ బస్‌లు ఎంజీబీఎస్‌ నుంచి రాకపోకలు కొనసాగించాయి.  

ప్రయాణికుల క్షేమమే లక్ష్యం 

ప్రతిప్రయాణికుడు మాస్కు ధరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. బస్టాండులో శుభ్రతతో పాటు శానిటైజర్లను ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి 1800 బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు  తీసుకున్నాం. ప్రయాణికులు కూడా వ్యక్తిగత శుభ్రత, మాస్కు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. కరోనా దృష్ట్యా బస్సులను కూడా శుభ్రంగా ఉంచుతున్నాం. -వరప్రసాద్‌, రంగారెడ్డి రీజియన్‌ ఆర్‌ఎంlogo