సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 11:33:42

ఖ‌మ్మంలో ఇంట్లోకి దూసుకెళ్లిన బ‌స్సు.. ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

ఖ‌మ్మంలో ఇంట్లోకి  దూసుకెళ్లిన బ‌స్సు.. ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

హైద‌రాబాద్‌: ఖ‌మ్మం జిల్లా కూసుమంచి మండ‌లంలో ఓ ప్రైవేట్ బ‌స్సు రోడ్డు ప‌క్క‌నే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభ‌ర్త‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సుమారు 20 మంది ప్ర‌యాణికుల‌తో ఓ ప్రైవేటు వోల్వో బ‌స్సు ఒడిశా నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్నది. శ‌నివారం ఉద‌యం కూసుమంచి మండ‌లంలోని నాయ‌క‌న్‌గూడెం వ‌ద్ద అదుపుత‌ప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణారావు దంప‌తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 

వారిని స్థానికులు స‌మీపంలోని ద‌వాఖాన‌కు త‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు బ‌స్సులో 20 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. వారంతా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. కాగా, డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో ఉండ‌ట‌మే ప్ర‌మాదానికి కార‌ణంగా తెలుస్తున్న‌ది.  కేసు న‌మోదు చేసిన పోలీసులు, ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


logo