సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 01:15:24

స్టీరింగ్‌ వదిలి.. శానిటైజర్‌ పట్టి

స్టీరింగ్‌ వదిలి.. శానిటైజర్‌ పట్టి

  • డ్రైవర్‌ నిర్లక్ష్యంతో అదుపు తప్పి డివైడర్‌పైకి చేరిన బస్సు

వేములవాడ రూరల్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఓ ఆర్టీసీ డ్రైవర్‌ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటుంటే బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.సిరిసిల్ల డిపోకు చెందిన నాన్‌స్టాప్‌ ఆర్టీసీ బస్సు శుక్రవారం కరీంనగర్‌ నుంచి సిరిసిల్లకు వస్తున్నది. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని కరీంనగర్‌ డెయిరీ వద్ద డ్రైవర్‌ స్టీరింగ్‌ విడిచిపెట్టి చేతులకు శానిటైజర్‌ రాసుకుంటుండగా బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. ప్రయాణికులు భయందోళనకు గురికాగా అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 20 మంది వరకు  ప్రయాణికులు ఉన్నారు. logo