బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 06:51:26

ట్రావెల్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం.. ప్రయాణికుల పడిగాపులు

ట్రావెల్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం.. ప్రయాణికుల పడిగాపులు

హైదరాబాద్‌ : ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు మూడు గంటలకుపైగా రోడ్డుపైనే వేచి ఉన్నారు. ఈ ఘటన జడ్చర్ల వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో పొగలు వ్యాపించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్దకు రాగానే స్వల్పంగా మంటలు, పొగలు వ్యాపించాయి. గమనించి బస్సును నిలిపివేశారు. లగేజీలో రెండు బైక్‌లు ఉండడం వల్ల పొగలు వ్యాపించినట్లుగా గుర్తించారు. కాగా ప్రమాణికులకు సదరు ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయలేదు. దీంతో వారంతా మూడు గంటలుగా రోడ్డుపైనే ఉండటంతో ఆందోళనకు దిగారు. బస్సు ప్రయాణికుల్లో ఎక్కువ మంది కడప వాసులుగా సమాచారం.


logo