శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 08:27:12

ఇంట్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు బ‌స్సు.. న‌లుగురికి గాయాలు

ఇంట్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు బ‌స్సు.. న‌లుగురికి గాయాలు

సూర్యాపేట‌: జిల్లాలోని కోదాడ‌లో ఓ ప్రేవేటు ట్రావెల్స్ బ‌స్సు అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్తున్నది. ఈరోజు తెల్ల‌వారుజామున సూర్యాపేట చేరుకున్న బ‌స్సు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డు వెంబ‌డి ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి బ‌స్సు ఇంట్లోకి దూసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. 


logo