e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News నల్లగొండలో ఈటల దిష్టిబొమ్మ దహనం

నల్లగొండలో ఈటల దిష్టిబొమ్మ దహనం

నల్లగొండ : దళితుల పట్ల జిల్లాలోని పెద్ద గడియారం సెంటర్లో టీఆర్ఎస్ దళిత విభాగం ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితుల పట్ల ఈటల బావమరిది చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలో స్వాతంత్ర్య అనంతరం దళిత కుటుంబాల ఆర్థిక బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు.

దళిత బంధు సహాయాన్ని ఈటల ఆయన బావమరిది మధుసూదన్ రెడ్డి అవహేళన చేసి మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శమన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేనప్పటికీ రైతుబంధు పథకానికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేడం అంటే చూస్తే ఈటల తాను హుజురాబాద్‌లో ఓడిపోతాననే భయంతోమతిస్థిమితం కోల్పోయి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరిపై తక్షణం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖబర్దార్ ఈటల.. దళిత సంఘాలు అన్నీ నీకు వ్యతిరేకంగా హుజురాబాద్‌లో పనిచేస్తాయన్నారు.

- Advertisement -


కార్యక్రమంలో నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, నల్గొండ మున్సిపల్ టీఆర్‌ఎస్‌ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సీనియర్ నాయకులు, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, బకరం వెంకన్న , జిల్లా శంకర్, దొడ్డి రమేష్, మాతంగి అమర్, కొత్తపల్లి పిచ్చయ్య, బొజ్జ వెంకన్న, బేరి నాగరాజు విమలమ్మ, పెరిక ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

దారుణం : ఆస్థి కోసం చెల్లెలు గొంతు కోసి చంపిన అన్న

హుజూరాబాద్‌లో వీధి రౌడీల్లా రెచ్చిపోతున్న బీజేపీ శ్రేణులు

మీరాబాయికి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ

ఈటలపై పెల్లుబికుతున్న దళితాగ్రహం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana