టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి పత్రిక దహనం

భద్రాద్రి కొత్తగూడెం/జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా అబద్ధపు ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రికను బుధవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు దహనం చేశారు. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఉన్నా టీబీజీకేఎస్ కార్యాలయంలో కార్మికులు ఆంధ్ర జ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక కాపీలను కాల్చి వేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకొని వారి ప్రయోజనాలను పరిరక్షించారని పేర్కొన్నారు.
కార్మికుల్లో అపోహలను కల్పించేందుకు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి కార్మికుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు శీర్షికలు రాసిన ఆంధ్రజ్యోతి దిన పత్రికను అంబేద్కర్ సెంటర్లో టీబీజీకే నాయకులు కాల్చివేశారు.
తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు