గురువారం 09 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 20:09:17

కాంగ్రెస్ కార్యకర్తలను పరుగులు పెట్టించిన ఎద్దులు

కాంగ్రెస్ కార్యకర్తలను పరుగులు పెట్టించిన ఎద్దులు

వరంగల్‌ : పెట్రోల్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన ధర్నాలో ఎద్దులు వీరంగం సృష్టించిన ఘటన వరంగల్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పెట్రోల్‌ ధరలు తగ్గించాలని నిరసన తెలిపేందుకు ఎద్దుల బండి, రిక్షాను తీసుకొచ్చారు కాంగ్రెస్‌ నాయకులు. ఇంతలో అక్కడ ఉన్న కొందరు కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు.

ఇంకేముంది ఎద్దులు బెదిరి పరుగులు పెట్టాయి. ఎదురుగా వస్తున్న వాహనాలపైకి సైతం దూసుకెళ్లాయి. చివరికి ఎద్దుల బండి యజమాని అదుపు చేయడంతో ఎద్దులు శాంతించాయి. ఈ ఘటనలో ఆ ఎద్దుల బండి యజమానితో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించారు.


logo