గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 30, 2020 , 15:38:48

పులి దాడి లో ఎద్దు మృతి..మరో రెండు పశువులకు గాయాలు

పులి దాడి లో ఎద్దు మృతి..మరో రెండు పశువులకు గాయాలు

ఆదిలాబాద్ : జిల్లాలోని గాదిగూడ మండలం మేడికూడ గ్రామ శివారులో ఈరోజు ఉదయం పులి దాడి చేసిన ఘటనలో ఎద్దు మృతి చెందగా మరో రెండు పశువులకు గాయాలయ్యాయి. మేడికూడకు చెందిన హెచ్ కె. ఇస్రు అనే రైతు తన పశువులను మేత కోసం అటవీ ప్రాంతం సమీపంలోకి వెళ్లాడు. మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని మేడిగూడ అడవులు ఉన్నాయి. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి ఒక్కసారిగా పశువుల పై దాడి చేసింది.

ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా మరో రెండు పశువులకు గాయాలయ్యాయి. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పులి దానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. గ్రామ సమీపంలో పులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సైతం పలుమార్లు పులి ఈ అటవీ ప్రాంతంలో సంతరించింది.                                            


logo