మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 19:36:56

త్వ‌ర‌లోనే బుద్ధ‌వ‌నం ప్రాజెక్టు పూర్తి : మ‌ంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌

త్వ‌ర‌లోనే బుద్ధ‌వ‌నం ప్రాజెక్టు పూర్తి : మ‌ంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌

హైద‌రాబాద్ : నాగార్జున‌సాగ‌ర్ బుద్ధ‌వ‌నం ప్రాజెక్టును త్వ‌ర‌లోనే పూర్తి చేయ‌నున్న‌ట్లు రాష్ర్ట ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత బుద్ధవనం ప్రాజెక్టుపై మంత్రి బుధ‌వారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స్పందిస్తూ.. నాగార్జునకొండ‌, బుద్ధ‌వ‌నం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్రాజెక్టు కోసం రూ. 25 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు చెప్పారు. త్వ‌ర‌లోనే బుద్ధ‌వ‌నం ప్రాజెక్టు పూర్త‌వుతుందన్నారు. చారిత్ర‌క వ‌స్తువుల‌తో మ్యూజియం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.