శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 03:12:07

ప్రధాన సమాచార కమిషనర్‌గా మురళి

ప్రధాన సమాచార కమిషనర్‌గా మురళి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర సమాచార కమిషన్‌ ప్రధాన సమాచార కమిషనర్‌గా బుద్దా మురళీకి రాష్ట్ర ప్రభు త్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రధాన సమాచార కమిషనర్‌ రాజాసదారాం పదవీ విరమణ చేయడం తో.. కమిషనర్‌గా ఉన్న బుద్దా మురళికి అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమాచార కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి రాజాసదారాంకు అభినందనలు తెలిపారు. తెలంగాణ సమాచార కమిషన్‌ పనితీరు బాగుందని ప్రశంసించారు. కార్యక్రమంలో సమాచార కమిషనర్లు కట్టా శేఖర్‌రెడ్డి, గుగులోతు శంకర్‌నాయక్‌, సయ్యద్‌ ఖలీలుల్లా, మైదా నారాయణరెడ్డి, మహ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు. 


logo