బుధవారం 24 ఫిబ్రవరి 2021
Telangana - Jan 15, 2021 , 20:06:10

బీటీపీఎస్‌ 3వ యూనిట్‌ సింక్రనైజేషన్‌ సక్సెస్‌

బీటీపీఎస్‌ 3వ యూనిట్‌ సింక్రనైజేషన్‌ సక్సెస్‌

భద్రాద్రి కొత్తగూడెం :  జిల్లాలోని మణుగూరు, పినపాక సరిహద్దు ప్రాంతంలో 1080 (270x 4) మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌)లోని యూనిట్‌-3లో శుక్రవారం నిర్వహించిన సింక్రనైజేషన్‌ ప్రక్రియ విజయవంతం అయింది. జెన్‌కో డైరెక్టర్‌(ప్రాజెక్టు) ఎం.సచ్చితానందం స్విచ్‌ ఆన్‌ చేసి ప్రక్రియను ప్రారంభించారు. విద్యుత్‌ ఉత్పత్తిని గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఈ ఏడాది మార్చిలో యూనిట్‌-3ని సీవోడీ చేస్తామన్నారు. ఈ ఏడాది మార్చిలో 4వ యూనిట్‌లో కూడా సింక్రనైజేషన్‌ చేపడతామన్నారు. జూన్‌లో సీవోడీ చేసి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. సింక్రనైజేషన్‌ విజయవంతం అయిన సందర్భంగా ఇంజినీర్లు సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీటీపీఎస్‌ సీఈ పిల్లి బాలరాజు, సీఈ (టీపిసీ) పీవీ శ్రీనివాస్‌, భేల్‌ జనరల్‌ మేనేజర్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo