గురువారం 04 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 21:39:49

సిరిసిల్లలో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

సిరిసిల్లలో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

సిరిసిల్ల  ‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆందోళనకు గురై ఓ బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు, కుటుంబీకుల తెలిపిన కథనం ప్రకారం.. జిల్లెల్ల గ్రామానికి చెందిన దాసరి బాలయ్య-లక్ష్మి దంపతులకు కూతురు స్రవంతి (20), కుమారుడు వంశీలు ఉన్నారు. బాలయ్య ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. కూతురు స్రవంతి ఇందూరులో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నది. కొడుకు వంశీ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కొంత కాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నది.

 ఈ నేపథ్యంలోనే  రోజు తల్లి లక్ష్మి, సోదరుడు వంశీ పొలం వద్దకు వెళ్లగానే, స్రవంతి తన ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ క్రమంలో వారి ఇంట్లోంచి భారీగా పొగలు రావడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకునేసరికే స్రవంతి మృతి చెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని సిరిసిల్ల దవాఖానకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్రవంతి రాసిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాను కరోనా వైరస్‌ బారిన పడతానమేనని భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు స్రవంతి ఆ లేఖలో రాసినట్లు ఎస్‌ఐ అభిలాష్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.logo