Telangana
- Nov 29, 2020 , 14:30:59
అమిత్ షా పర్యటనలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరసన

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు నిరసనల సెగ తగిలింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న కంపెనీలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్న విషయం తెలిసిందే. కాగా, అమిత్ షా టూర్లో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వారాసిగూడలో సేవ్ బీఎస్ఎన్లో (save bsnl) పేరుతో ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైన, అపార్ట్మెంట్ల నుంచి తమ నిరసన తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయొద్దని నినదించారు.
తాజావార్తలు
MOST READ
TRENDING