గురువారం 16 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 00:38:15

జన్మభూమి రుణం తీర్చుకున్నారు

జన్మభూమి రుణం తీర్చుకున్నారు

  • వల్మీడి పంచాయతీకి మాశెట్టి సోదరుల భూదానం
  • మంత్రి ఎర్రబెల్లికి రిజిస్ట్రేషన్‌ పత్రాల అందజేత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామంలో మౌలిక అభివృద్ధికి భూదానం చేసి జన్మభూమి రుణం తీర్చుకున్నారు హైదరాబాద్‌లో స్థిరపడిన మాశెట్టి ఉపేందర్‌, కృష్ణ, వెంకటేశ్‌ సోదరులు. తమ స్వగ్రామం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామ పంచాయతీకి  తమ తల్లిదండ్రుల స్మారకార్థం 300 గజాల భూమిని విరాళంగా ఇచ్చారు. భూమిని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించి, మంగళవారం సంబంధిత పత్రాలను హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి చేతులమీదుగా సర్పంచ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పురిటి గడ్డ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పరంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనందించాలన్నారు


logo