బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 01:52:09

శ్రీశైలంలో విరిగిపడ్డ కొండచరియలు

శ్రీశైలంలో విరిగిపడ్డ కొండచరియలు

శ్రీశైలం: శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి డ్యాంసైట్‌ కుడిగట్టు కాలువ ప్రవేశ ద్వారం వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న సుమారు పదిమంది ఎస్పీఎఫ్‌ సిబ్బంది అప్రమత్తం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా నల్లమల అటవీ ప్రాంతంలో పొగ మంచు కారణంగా రోడ్డు కనిపించక శిఖరం వద్ద ఓ కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. శ్రీశైల దేవస్థానం సెక్యూరిటీ గార్డు సూర్యప్రకాశ్‌ గమనించి వెంటనే లోయలోకి దిగి కారులోంచి ఆ నలుగురిని కాపాడాడు. logo