గురువారం 09 జూలై 2020
Telangana - Feb 05, 2020 , 01:51:17

హైదరాబాద్‌ రహదారులు సూపర్‌

హైదరాబాద్‌ రహదారులు సూపర్‌
  • బ్రిటిష్‌ వృద్ధదంపతుల ప్రశంస
  • హైదరాబాద్‌కు చేరిన ‘ట్రాన్స్‌ ఇండియా చాలెంజ్‌' యాత్ర
  • సర్క్యులర్‌ ఎకానమీ ప్రాజెక్టులకు నిధుల సేకరణే ధ్యేయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ రహదారులు సూపర్‌గా ఉన్నాయని బ్రిటన్‌కు చెందిన అలెన్‌ బ్రేత్‌వైట్‌ (73), ప్యాట్‌ దంపతులు ప్రశంసించారు. మంగళవారం వారు హైదరాబాద్‌లోని బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 1వ తేదీన ముంబైలో ప్రారంభమైన ట్రాన్స్‌ ఇండియా చాలెంజ్‌ యాత్ర ఖమ్మం, రాజమండ్రి, కోల్‌కతా, పాట్నా, వారణాసి, న్యూఢిల్లీ, ఉదయ్‌పూర్‌ తదితర ప్రాంతాల మీదుగా 34 రోజులపాటు దాదాపు 5,600 కి.మీ. దూరం సాగుతుందని వెల్లడించారు. భారత్‌లో సర్క్యులర్‌ ఎకానమీ ప్రాజెక్టులకు రూ.1.8 కోట్ల నిధులను సేకరించేందుకు ‘గూంజ్‌' సంస్థతో కలిసి ఈ యాత్ర నిర్వహిస్తున్న ట్రాన్స్‌ ఇండియా చాలెంజ్‌కు రాల్ఫ్‌ లారెన్‌, మోర్గాన్‌ మోటర్‌ కంపెనీ, వరల్డ్‌వైడ్‌ ఫుడ్స్‌, బేరింగ్‌ పాయింట్‌, ఈ-కార్గో బైక్స్‌, యూకే ఫారిన్‌ అండ్‌ కామన్‌వెల్త్‌ ఆఫీస్‌ సహకారం అందిస్తున్నాయని వివరించారు.


అలెన్‌ యాత్ర స్ఫూర్తిదాయకం: ఫ్లెమింగ్‌

భారత గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం కలిగించేందుకు ఈ యాత్ర చేపట్టిన అలెన్‌, ప్యాట్‌ దంపతులకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నామని హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ చెప్పారు. శస్త్రచికిత్స చేయించుకొన్న అలెన్‌ 73 ఏండ్ల వయసులో ఈ యాత్ర చేపట్టడం అనేక మందికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ మీడియా సమావేశంలో గూంజ్‌ ప్రతినిధి శ్రీధర్‌ తదితరులు కూడా పాల్గొన్నారు.


logo