మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 01:25:49

బ్రిటన్‌ వైరస్‌ వేగం 71% అధికం

బ్రిటన్‌ వైరస్‌ వేగం 71% అధికం

  • యూకేలో వెలుగుచూస్తున్న 60 శాతం కేసులు ఇవే
  • 40 నమూనాలలో ముగ్గురికి కొత్తరకం స్ట్రెయిన్‌
  • కొవిడ్‌ జాగ్రత్తలతోనే ‘కొత్త’ మహమ్మారి నియంత్రణ
  • సీసీఎంబీ ప్రకటన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌ (కొవిడ్‌-2-బీ.1.1.7) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) తెలిపింది. ఇతర వైరస్‌తో పోల్చితే ఇది 71 శాతం వేగంగా విస్తరిస్తున్నదని పేర్కొన్నది. భారత్‌లో బ్రిటన్‌ రకం కేసులు నమోదైన నేపథ్యంలో ఆ వైరస్‌ సమాచారాన్ని సీసీఎంబీ మంగళవారం మీడియాతో పంచుకున్నది. బ్రిటన్‌లో ఈ వైరస్‌ను సెప్టెంబర్‌లో గుర్తించారని, ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతం ఈ రకానికి చెందినవేనని తెలిపింది. ట్రేసింగ్‌, టెస్టింగ్‌లో భాగంగా ఇప్పటివరకు బ్రిటన్‌ నుం చి వచ్చిన 33వేల మంది ప్రయాణికులను గుర్తించి పరీక్షలుచేశారు. సీసీఎంబీకి 40 న మూనాలు పంపించారని, వాటి జన్యుక్రమా న్ని విశ్లేషించగా.. ముగ్గురిలో కొత్తరకం వైరస్‌ ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ‘వైరల్‌ జీనో మ్‌ సీక్వెన్సింగ్‌ను వేగవంతం చేయాలి. కొత్త రకం వైరస్‌ ఉనికిని తెలుసుకోవాలి. ఈ ప్ర క్రియ కోసం ప్రస్తుతం సంప్రదాయమైన సాంగర్‌ సీక్వెన్సింగ్‌, ఆధునిక నెక్ట్స్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ టూల్స్‌ని వినియోగిస్తున్నాం’ అని సీసీఎంబీలో జన్యు క్రమం విశ్లేషణలో ప్రధానపాత్ర పోషిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్‌ దివ్యతేజ్‌ సౌపాటి పేర్కొన్నారు. ‘కొత్త రకం కరోనా వైరస్‌ జన్యు పదార్థంలో 17 రకాల ఉత్పరివర్తనాలు ఉన్నాయి.  ఇందులో ఎనిమిది... అతిథేయి కణాల ైస్పెక్‌ ప్రొటీన్‌ మీద ప్రభావం చూపి, ఏస్‌ గ్రాహకాలతో అతుక్కుంటున్నది. మరొక ఉత్పరివర్తనం మాత్రం వైరస్‌, గ్రాహకాల మధ్య బంధాన్ని పెంచి అతిథేయ కణంలోకి ప్రవేశిస్తున్నది. ఈ తరహా వైరస్‌.. వ్యాధి లక్షణాలను, వ్యాధిని ప్రభావితం చేయలేదు’ అని సీసీఎంబీ తెలిపింది. 

కొవాగ్జిన్‌తో కట్టడి: భారత్‌ బయోటెక్‌

కొవిడ్‌తో వెలుగుచూస్తున్న ఉత్పరివర్తనాలన్నింటినీ తాము అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌తో అరికట్టవచ్చని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఐసీఎంఆర్‌, జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని సంస్థ సీఎండీ కృష్ణా ఎల్ల తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు లైసెన్స్‌ ఇవ్వాలని అధికారులను కోరామని చెప్పారు. 

క్షేమంగా వరంగల్‌ వాసి

యూకే రకం వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన వరంగల్‌వాసి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రైమరీ కాంటాక్టు అయిన ఆయన తల్లికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, భార్య, డ్రైవర్‌కు నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. 49 ఏండ్ల వయస్సు గల వరంగల్‌ వాసి డిసెంబర్‌ 10న బ్రిటన్‌ నుంచి వచ్చారు. అతడికి నిర్వహించిన కరోనా టెస్ట్‌లో పాజిటివ్‌ అని తేలింది. ఆ నమూనాలను సీసీఎంబీకి పంపించగా.. బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం వైరస్‌ అని వెల్లడైం ది. ఈ విషయాన్ని సీసీఎంబీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి తెలిపింది.  బాధితుడిని కలుసుకు న్న వారి వివరాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నారు. 

కొత్త రకంపై ఆందోళన వద్దు..

కొత్త వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్ర స్తుతం కొవిడ్‌కు అందిస్తున్న చికిత్సతోనే దీన్ని నయం చేయవచ్చు. లక్షణాలు, తీవ్రత ఒకేవిధంగా ఉన్నా వైరస్‌ వ్యాప్తి వేగం గా జరుగుతున్నది. జన్యుక్రమాన్ని పరిశీలించే ప్రక్రియను పెం పొందించడం ముఖ్యం. వైరస్‌వ్యాప్తి పరిధిని అంచనా వేయడానికి, ఇతర వైవిధ్యాలను గుర్తించేందుకు వైరస్‌ జన్యుక్రమాలను విశ్లేషించాల్సి ఉన్నది.

- రాకేశ్‌మిశ్రా,సీసీఎంబీ డైరెక్టర్‌