ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:21:08

రిలీవ్‌ లెటర్‌కూ లంచం

రిలీవ్‌ లెటర్‌కూ లంచం

  • ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో

గద్వాల టౌన్‌: పీహెచ్‌సీ వైద్యురాలికి రిలీవ్‌ లెటర్‌ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు జోగుళాంబ గద్వాల డీఎంహెచ్‌వో. ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి పీహెచ్‌సీ డాక్టర్‌ మంజులకు కాకతీయ యూనివర్సిటీ లో పీజీ సీటు రావడంతో రిలీ వ్‌ చేయాలని గతనెల 17న డీఎంహెచ్‌వో భీమానాయక్‌ను కోరారు. రిలీవ్‌ లెటర్‌ ఇచ్చేందుకు భీమానాయక్‌ డబ్బును డిమాండ్‌ చేశాడు. అయితే గురువారం డాక్టర్‌ మంజుల దంపతుల నుంచి డీఎంహెచ్‌వో రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. సదరు మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు భీమానాయక్‌ను ఏసీబీ స్పెషల్‌ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. 


logo