శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 14:56:56

బ్రేకింగ్‌.. వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు

బ్రేకింగ్‌.. వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు

జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా మూడ్రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కుందనపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు దాటే ప్రయత్నంలో 12 మంది రైతులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. 

పోలీసులు, రెస్క్యూ టీం వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావడంలేదు. ఈ మేరకు సమాచారం అందుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిస్థితి గురించి ఫోన్‌లో కేటీఆర్‌కు తెలియజేశారు. స్పందించిన కేటీఆర్‌ రైతులను కాపాడేందుకు హెలికాఫ్టర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. మరికొద్ది సేపట్లో సంఘటనా స్థలానికి హెలికాఫ్టర్‌ చేరుకొని రైతులను కాపాడనున్నట్లు సమాచారం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo