గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 20:43:30

మక్కపంటకు విరామమే మంచిది : సీఎం

మక్కపంటకు విరామమే మంచిది : సీఎం

హైద‌రాబాద్ : మ‌క్క పంట‌కు ఈసారి విరామం ఇస్తేనే మంచిద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ... మక్కజొన్నలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అనుకూలంగా లేద‌న్నారు. దీనికి తోడు కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గించ‌డం, పక్కరాష్ట్రాల్లో మక్కలు తక్కువ ధరలకే లభించడం వంటి అంశాలు మొక్కజొన్న పంటసాగును నిరుత్సాహ పరుస్తున్నాయ‌న్నారు. ఈ ప‌రిస్థితులన్నింటి నేప‌థ్యంలో యాసంగిలో కూడా మొక్కజొన్న పంటకు మద్ధతు ధర వచ్చే పరిస్థితి లేదన్నారు. క్వింటాలుకు 800 నుంచి తొమ్మిది వందల లోపే ధర పలికే పరిస్థితి ఉంద‌నే విషయాన్ని రైతుకు స్పష్టం చేయాల్సిందిగా సూచించారు. అయినా మక్కలు పండిస్తం అంటే ఇక ఆయా రైతుల ఇష్టం అని సీఎం పేర్కొన్నారు. 


logo