బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 16:07:39

ఫేక్ న్యూస్‌ను అరిక‌డుదాం : హైద‌రాబాద్ పోలీసులు

ఫేక్ న్యూస్‌ను అరిక‌డుదాం : హైద‌రాబాద్ పోలీసులు

హైద‌రాబాద్ : ‌సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే కొన్ని వార్త‌లు, విష‌యాలు న‌మ్మ‌శ‌క్యంగా ఉండ‌డం లేదు. త‌ప్పుడు వార్త‌లు, విష‌యాలు అధికంగా వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో తెలుసుకోలేని ప‌రిస్థితి దాపురించింది. ఫేక్ న్యూస్ వైర‌ల్ కావ‌డంతో ఓ వైపు ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వ‌డం, మ‌రోవైపు ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తున్నాయి. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ సిటీ పోలీసులు న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ అరిక‌డుదామ‌ని పిలుపునిస్తున్నారు. ఫార్వార్డెడ్ మేసేజ్‌ల‌ను మ‌ళ్లీ ఫ్వార్వార్డ్ చేయొద్ద‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. 

అసాంఘిక శ‌క్తులు సృష్టించే త‌ప్పుడు వార్త‌ల‌ను, వ‌దంతుల‌ను, త‌ప్పుడు సోష‌ల్ మీడియా పోస్టుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, షేర్ చేయొద్ద‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. వ‌దంతులు, త‌ప్పుడు సోష‌ల్ మీడియా పోస్టుల గురించి 9490616555 నంబ‌ర్‌కు ఫిర్యాదు చేయాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. ప్ర‌తి పౌరుడు స‌మాజ భ‌ద్ర‌త‌కై కృషి చేయాల‌ని హైద‌రాబాద్ పోలీసులు కోరుతున్నారు. 


logo