శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 07:22:57

ఏయూ ప్రవేశ గడువు పొడిగింపు

ఏయూ ప్రవేశ గడువు పొడిగింపు

హైదరాబాద్‌ : బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ (పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ తదితర) కోర్సుల్లో చేరడానికి చివరి తేదీని అక్టోబర్‌ 15 వరకు పొడిగించారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.inలో పొందుపర్చినట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. వివరాలకు 73829 29570/ 580/ 590/ 600 లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040 2368 0333 / 555 ఫోన్‌ నంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo