గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 02:16:08

మన సోనాకు బ్రాండ్‌ ఇమేజ్‌

మన సోనాకు బ్రాండ్‌ ఇమేజ్‌

  • ఐఎస్బీతో జతకట్టిన వ్యవసాయవర్సిటీ, ప్రభుత్వం
  • అంతర్జాతీయంగా బ్రాండింగ్‌ కల్పించేందుకు ప్రణాళిక
  • మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు తెలంగాణ సోనా
  • 10 లక్షల ఎకరాల్లో సాగుకు నిర్ణయం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలుచేసే సన్నబియ్యంరకం తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)కు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ఇమేజ్‌ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ బియ్యం రకాన్ని మార్కెటింగ్‌ చేసేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్బీ)తో జతకట్టింది. మంగళవారం ప్రభుత్వం, వ్యవసాయ యూనివర్సిటీ, ఐఎస్బీ మధ్య ఒప్పందం కుదిరింది. ఐఎస్బీ.. తెలంగాణ సోనాకు జాతీయంగా, అంతర్జాతీయంగా బ్రాండింగ్‌ కల్పించడంతోపాటు మార్కెటింగ్‌ ప్రణాళికలను రూపొందించనున్నది. 

తెలంగాణ సోనాను 2015లో జయశంకర్‌ వ్యవసాయవర్సిటీ రూపొందించింది. ఈ బియ్యంలో గ్లూకోజ్‌శాతం (ైగ్లెసెమిక్‌) తక్కువగా ఉన్నట్టు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) తేల్చింది. దీంతోపాటు అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనపత్రాలను ప్రచురించింది. విటమిన్‌-బీ3 కూడా పుష్కలంగా ఉన్నట్టు గుర్తించింది. ఇతరరకాల సాగుతో పోల్చితే తక్కువ సమయంలో పంటవచ్చే తెలంగాణ సోనా వానకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ అనుకూలమైదని వ్యవసాయవర్సిటీ తెలిపింది. సాగునీరు, ఎరువులు, కాలం, ఖర్చును ఆదాచేయడంతోపాటు అధిక దిగుబడులు ఇచ్చే తెలంగాణ సోనాను ఈ సీజన్‌లో 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియంత్రిత సాగువిధానంలో రైతులకు సూచించింది.



logo