సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 18:35:11

బ్రెయిన్‌డెడ్‌ వృద్ధుడి అవయవాలు దానం

బ్రెయిన్‌డెడ్‌ వృద్ధుడి అవయవాలు దానం

హైదరాబాద్‌ : భోగోజు వెంకట స్వామి(67) అనే వృద్ధుడిని వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించారు. దీంతో బంధువులు ఇతడి అవయవాలను జీవన్‌దాన్‌ ఆర్గాన్‌ డోనేషన్‌కు దానం చేసేందుకు సమ్మతి తెలిపారు. ఉప్పర్‌పల్లిలోని వెంకటేశ్వర ఎన్‌క్లేవ్‌ నివాసి వెంకటస్వామి ఈ నెల 4వ తేదీన ఇంట్లో తలతిరగడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అదేరోజు మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు.

పలు వైద్య చికిత్స అనంతరం న్యూరో ఫిజిషియన్స్‌ స్పందిస్తూ.. బ్రెయిన్‌లో ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ కారణంగా బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించారు. ఆస్పత్రి వర్గాలు, జీవన్‌దాన్‌ కౌన్సిలింగ్‌తో అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. భర్త, కుమారుడి సమ్మతితో అవయవాలను సేకరించారు. ఉన్నత కారణం కోసం కుటుంబ సభ్యులు చూపిన ఉదారతను జీవన్‌దాన్‌ అధికారులు ప్రశంసించారు. లివర్‌ను సేకరించి ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌కు తరలించారు. 


logo