గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:16:48

వేలానికి బ్రహ్మ వజ్రకమలం

వేలానికి బ్రహ్మ వజ్రకమలం

  • రిజర్వ్‌ ధర రూ. 78 లక్షలు.. వచ్చిన డబ్బులో 10% పీఎం కేర్స్‌కు

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: 7,801 వజ్రాలు పొదిగి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న బ్రహ్మ వజ్రకమలం ఉంగరాన్ని ఈ నెల 13 నుంచి 22వరకు ఆన్‌లైన్‌ వేలం వేయనున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌- 36లోని ‘ది డైమండ్‌ స్టోర్‌' నిర్వాహకుడు, డిజైనర్‌ కొట్టి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఈ ఆరుదైన ఉంగరాన్ని సుమారు 11 నెలలపాటు శ్రమించి తయారుచేశారు. ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించే ఈ ఉంగరం రిజర్వ్‌ ధర రూ.78 లక్షలుగా నిర్ణయించామని, వచ్చిన డబ్బులో 10 శాతం పీఎం కేర్‌ ఫండ్స్‌కు విరాళంగా అందిస్తామని నిర్వాహకుడు కొట్టి శ్రీకాంత్‌ తెలిపారు.