మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 19:03:50

గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలో ఈ నెల 14న కురిసిన భారీ వర్షానికి అప్పచెరువు తెగిపోవడంతో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన వారిలో ఓ బాలుడు మృతదేహం ఆదివారం లభ్యమైంది. గగన్ పహాడ్ చౌరస్తాలోని సెలబ్రిటీ ఫంక్షన్ హాల్ సమీపంలోని చెట్ల పొదల్లో బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి  తరలించారు. మృతదేహం అయాన్(7)ది గుర్తించారు.  అప్ప చెరువుకు తెగిపోవడంతో వరదలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతుకాగా వీరిలో కరిమా బేగం, అమీర్ ఖాన్, సాహిల్(4) మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo