బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 18:55:21

పిడుగుపాటుకు బాలుడు మృతి.. ముగ్గురికి గాయాలు

పిడుగుపాటుకు బాలుడు మృతి.. ముగ్గురికి గాయాలు

నారాయణపేట : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగుపడి బాలుడు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్యాతన్ పల్లి గ్రామానికి చెందిన బాబు అరుణ్ కుమార్(14)  పదోతరగతి చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో  పాఠశాల తెరవకపోవడంతో పత్తి తీసేందుకు వెళ్లాడు. భోజనం సమయంలో వర్షం రావడంతో  తోటి  కూలీలతో  కలిసి చెట్టు కిందకు వెళ్లగా చెట్టుకు సమీపంలో పిడుగుపడటంతో అరుణ్ కుమార్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. కూలీలు పాపమ్మ( 62) ,వెంకటమ్మ (38) ,లక్మి (38)కి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం దామరగిద్ద ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.