మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:21:21

బర్త్‌డేకు డబ్బులు ఇవ్వలేదని బాలుడి ఆత్మహత్య

బర్త్‌డేకు డబ్బులు ఇవ్వలేదని బాలుడి ఆత్మహత్య

మల్లాపూర్‌: క్షణికావేశానికిలోనై ప్రాణం తీసుకున్నాడో బాలుడు. పుట్టినరోజు జరుపుకోవడానికి తల్లిదండ్రులను డబ్బులు అడిగితే లేవన్నందుకు ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం గుండంపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేకల నర్సయ్య, విజయ దంపతుల కుమారుడు నివాస్‌ (16), కూతురు నిహరిక(12) ఉన్నారు. నివాస్‌ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. గురువారం పుట్టినరోజు కావటంతో కొత్త బట్టలు కొనుక్కోవడానికి, కేక్‌ కోసం అని తల్లిదండ్రులను రూ.5వేలు అడిగాడు. నర్సయ్య గీత కార్మికుడు కావటంతో అంత డబ్బు లేదని బదులిచ్చాడు. దీంతో వారితో గొడవపడ్డ బాలుడు.. చచ్చిపోతానని బెదిరిస్తూ ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.logo