శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 15:53:41

బుడ్డోడి అద్భుత‌ విన్యాసాలు.. మంత్రి కేటీఆర్ ఫిదా!.. వీడియో

బుడ్డోడి అద్భుత‌ విన్యాసాలు.. మంత్రి కేటీఆర్ ఫిదా!.. వీడియో

హైద‌రాబాద్‌: ఓ బుడ్డోడు క‌ళ్లు మిరుమిట్లు గొలిపించే విన్యాసాలు చేశాడు. ఆ విన్యాసాలను చూసినవాళ్లు ఔరా అంటూ నోరెళ్లబెట్ట‌క త‌ప్ప‌దు. ఒలింపిక్స్‌లో ప్రొఫెష‌న‌ల్ జిమ్నాస్ట్‌ల‌ను త‌ల‌ద‌న్నేలా ఆ బుడత‌డి ఫీట్స్ ఉన్నాయి. ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి అనామతం గాల్లో ప‌ల్టీలు కొడుతున్న అత‌ని తీరు చూస్తుంటే భ‌విష్య‌త్తులో త‌ప్ప‌క గోల్డ్ మెడ‌ల్ సాధిస్తాడ‌నిపిస్తుంది. ఈ బుడ్డోడి విన్యాసాల‌కు సంబంధించిన వీడియోను పుట్ట విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అనే వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్టుకు మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశాడు. 

దాంతో ఆ వీడియోను వీక్షించిన మంత్రి కేటీఆర్ సైతం వావ్ అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు. భవిష్య‌త్ ఒలింపిక్ ప‌త‌క విజేత త‌యార‌వుతున్నాడంటూ ఆ బుడ్డోడి ప్ర‌తిభ‌ను కొనియాడారు. ఆ చిన్నోడు హైద‌రాబాద్‌కు చెందిన వాడా, లేక దేశంలోని మ‌రే ప్రాంతానికైనా చెందిన‌వాడా..? అని ఆరాతీశారు. అద్భుత‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన ఆ బుడ్డోడు ఎవ‌రో తెలిస్తే అత‌ని ప్ర‌తిభ‌ను మ‌రింత మెరుగుప‌ర్చుకునేందుకు సాయం చేస్తాన‌ని పేర్కొన్నారు. మ‌రి, క‌ళ్లు చెదిరేలా ఆ బుడ‌త‌డు చేసిన విన్యాసాల‌ను మీరూ ఒక‌సారి చూడండి.. 

  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo