బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 11:35:54

బోసిపోయిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం

బోసిపోయిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం

యాదాద్రి భువనగిరి : కరోనా విజృంభిస్తున్న కారణంగా  దేవాదాయ శాఖ ఆదేశాలతో నేటి నుంచి మూడు రోజులు పాటు ఆలయంలో భక్తుల దర్శనాలను రద్దు చేశారు. కొండ మీద, కింద వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా మూత పడ్డాయి. దీంతో యాదాద్రి పరిసరాలు బోసిపోయి కనిపించాయి. నిత్యం వేలాది భక్తజనంతో నిత్యకల్యాణం, పచ్చతోరణంలా కళకళ లాడే యాదాద్రి భక్తులు లేక  నిర్మానుష్యంగా మారింది. స్వామి వారి నిత్య కైకిర్యములు, ఆన్ లైన్ సేవలు, ఏకాంత సేవలను భక్తులు లేకుండా అర్చకులు యథావిధిగా నిర్వహిస్తున్నారు. 


logo