గురువారం 04 జూన్ 2020
Telangana - May 21, 2020 , 02:37:45

నేటి నుంచి రైల్వే బుకింగ్స్‌

నేటి నుంచి రైల్వే బుకింగ్స్‌

జూన్‌ 1 నుంచి 200 ప్రత్యేక రైళ్లు

పలు తెలంగాణ రైళ్లకు చోటు

న్యూఢిల్లీ, మే 20: వచ్చే నెల 1 నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు గురువారం ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. టికెట్లు  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి. కౌంటర్లు బంద్‌ ఉంటా యి. నాన్‌ ఏసీతోపాటు ఏసీ కోచ్‌లనూ నడుపనున్నారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు  ఉన్నాయి. 

తెలంగాణ రైళ్లు ఇవే..

ఢిల్లీ-హైదరాబాద్‌: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ముంబై-హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్‌, హౌరా-సికింద్రాబాద్‌: ఫలక్‌ను మా ఎక్స్‌ప్రెస్‌,  సికింద్రాబాద్‌-డనపూర్‌ సూపర్‌ఫాస్ట్‌, గుంటూరు-సికిం ద్రాబాద్‌: గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి-నిజామా బాద్‌: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌. 

సూచనలివే.. 

గరిష్ఠంగా 30 రోజుల ముందు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చేసుకోవచ్చు. ప్రయాణికులు 90 నిమిషాలు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలి.మాస్క్‌ ధరించడం, ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరి. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. కరోనా లక్షణా లు లేనివారినే ప్రయాణానికి అనుమతినిస్తారు. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటుంది. కన్ఫర్మ్‌ అయితేనే రైల్లోకి అనుమతిస్తారు. 



logo