ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 18:21:58

బోనాల పండుగ ఇంట్లోనే జరుపుకుందాం: ఇంద్రకరణ్‌ రెడ్డి

బోనాల పండుగ ఇంట్లోనే జరుపుకుందాం: ఇంద్రకరణ్‌ రెడ్డి

హైదరాబాద్‌: ఈ ఏడాది బోనాల పండుగను ఇంటివద్దే జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. బోనాల పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈసారి సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కువ మంది గుమికూడకుండా కుటుంబ సభ్యులే పండుగ జరుపుకోవాలని వెల్లడించారు. ఆలయాల్లో అర్చకులు సంబంధిత పూజలు చేస్తారని తెలిపారు. పూజలు, ఇతర కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. 

జంట నగరాల్లో ఆషాఢ మాసంలో జరుపుకొనే బోనాల వేడుకను కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆలయాల్లో అమ్మవార్లకు పూజారులు మాత్రమే బోనాలు సమర్పిస్తారని, ఎవరిట్లో వారే అమ్మవారికి బోనం సమర్పించుకోవాలని సూచించింది.  ఆలయాల్లో బోనం సమర్పించకపోవడం వల్ల దోషమేమీ ఉండదని పండితులు వెల్లడించారు. 


logo