శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 18:49:21

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌..

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌..

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ సినీనటి ఈషా డియోట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె తన ఫాలోవర్లను అప్రమత్తం చేసింది. ఇమేషాడియోల్‌ పేరుతో ఉన్న నా అధికార ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఈ ఉదయం హ్యాక్‌ అయ్యింది. ఎలాంటి సందేశాలు వచ్చినా స్పందించవద్దు. అసౌకర్యానికి క్షమించాలి’ అని 39 ఏండ్ల నటి ట్విట్టర్లో పోస్టు చేసింది. కాపీ రైట్స్‌ ఉల్లంఘన పేరుతో తనకు వచ్చిన సందేశాన్ని.. తన అకౌంట్‌ పేరు ఇన్‌స్టాగ్రామ్‌ సపోర్టుగా మారడాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఇటీవల ప్రముఖ బాలీవుడ్‌ గాయని ఆషా బోస్లేతోపాటు నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్‌, ప్రముఖ సెలబ్రెటీ ఇంటీరియర్‌ డిజైనర్‌ సుసన్నీఖాన్‌, నటుడు విక్రాంత్‌ మెస్సీ, కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ ఫరాఖాన్‌ సోషల్‌ మీడియా ఖాతాలు హ్యాక్‌ అయిన విషయం తెలిసిందే. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo