శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 21:30:34

కోవిడ్‌-19తో బోధ‌న్ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ మృతి

కోవిడ్‌-19తో బోధ‌న్ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ మృతి

నిజామాబాద్ : బోధ‌న్ మున్సిప‌ల్ కౌన్సిలర్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎం. గుణప్రసాద్ కోవిడ్ -19 తో మరణించారు. గుణప్రసాద్ బోధన్ మున్సిపాలిటీలో సీనియర్ కౌన్సిలర్. 1995 నుండి నాలుగుసార్లు కౌన్సిల‌ర్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. గుణ‌ప్ర‌సాద్‌, ఆయ‌న భార్య కొద్ది రోజుల క్రితం కోవిడ్ -19 భారిన పడ్డారు. హైదరాబాద్ న‌గ‌రంలోని దక్కన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న గురువారం మృతిచెందారు. 

కొన్ని రోజుల‌క్రితం బోధ‌న్ ఏరియా ఆస్ప‌త్రి స్టాఫ్ న‌ర్సులు ముగ్గురు, వారి కుటుంబ స‌భ్యులు కోవిడ్‌-19 భారిన ప‌డ్డారు. అదేవిధంగా బోధ‌న్ ప‌ట్ట‌ణానికి చెందిన ఓ ఎల్ఐసీ ఏజెంట్ ఈ వ్యాధి భారిన ప‌డ్డాడు. వీరింతా ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు.


logo