Telangana
- Jan 16, 2021 , 01:28:28
VIDEOS
బండి.. బడాయి మానెయ్

- ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు
హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బడాయి మాటలు మానాలని శాసనమండలి చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు హితవు పలికారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. హెడ్లైన్ కోసం డెడ్‌లైన్ మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ర్టానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. అనేక పోరాటాలకు, త్యాగాలతో తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు, పాలనాదక్షత ఉన్న సీఎం కేసీఆర్‌ను ఏకవచనంలో సంబోధించడం సరికాదని పేర్కొన్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ రాజకీయాలు చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
- బీజేపీ పాలన.. బ్రిటీషర్లను మించిపోయింది: కేజ్రీవాల్
- బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : ఎమ్మెల్సీ కవిత
- ఒక్క మెడికల్ కాలేజీ, పసుపు బోర్డు తీసుకురాలేదు: మంత్రి ఎర్రబెల్లి
- టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్తే ఏషియా కప్ వాయిదా
- మళ్లీ కొలతూర్ నుంచే స్టాలిన్ పోటీ
- ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్
- దక్షిణ చైనా సముద్రంలో చైనా లైవ్ ఫైర్ డ్రిల్
- తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
MOST READ
TRENDING