బుధవారం 03 జూన్ 2020
Telangana - May 07, 2020 , 16:29:16

రక్తదానం మహాదానం: మంత్రి ఎర్రబెల్లి

రక్తదానం మహాదానం: మంత్రి ఎర్రబెల్లి

జనగామ : ర‌క్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న వాళ్ల ప్రాణాలు కాపాడవచ్చని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ టి. రాజ‌య్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ  క‌రోనా కష్టకాలంలో రక్తదానం చేయాల్సిన అవసరం ఉంటుంద‌న్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు. అందుకే ర‌క్తదాన శిబిరాలు విరివిగా నిర్వహించాలని మంత్రి తెలిపారు. త్వరలో ఉప్పుగ‌ల్లు రిజ‌ర్వాయ‌ర్ ప‌నులు ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే దేవాదుల ప్రాజెక్టు నీటి విష‌య‌మై కూడా సీఎం చ‌ర్చించార‌ని మంత్రి వివ‌రించారు.


logo