ఆదివారం 31 మే 2020
Telangana - May 05, 2020 , 14:40:47

తలసేమియా బాధితుల కోసం రక్తదానం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తలసేమియా బాధితుల కోసం రక్తదానం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ పిలుపుమేరకు తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేపట్టామని పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. నారాయణగూడ ఐపీఎంలో రక్తదాన శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేపట్టామని తెలిపారు. కేటీఆర్‌ పిలుపుమేరకు వారంపాటు రక్తదాన కార్యక్రమాలు చేపడుతామన్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ఉద్యోగులు వారంపాటు రక్తదానం చేస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రక్త నిల్వల సమస్య లేదన్నారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చేవరకు తగు జాగ్రత్తలు అందరూ పాటించాలని మంత్రి కోరారు. మానవాళి జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాష్ర్టాల్లో మద్యం దుకాణాలు తెరిచారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవకపోతే ఇతర రాష్ర్టాల కల్తీ మద్యం వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి. గుడుంబా వాడకం పెరుగుతుంది. ప్రజారోగ్య దృష్ట్యా మంత్రివర్గంలో చర్చించి సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. 


logo