బుధవారం 27 మే 2020
Telangana - May 05, 2020 , 01:29:40

రక్తదానం.. మహాదానం

రక్తదానం.. మహాదానం

  • టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పిలుపుమేరకు బోడుప్పల్‌ పరిధి చెంగిచర్లలో కేఆర్‌ఎల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ లక్ష్మీరవిగౌడ్‌, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
  • నవయుగ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయ దవాఖాన ఎండీ అల్లం పాండురంగారావు సహకారంతో చందానగర్‌ పీజేఆర్‌ స్టేడియంలో రక్తదాన శిబిరాన్ని  ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ ప్రారంభించారు. కార్పొరేటర్లు బొబ్బ నవతారెడ్డి, వి.జగదీశ్వర్‌గౌడ్‌, స్థానిక ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ పాల్గొన్నారు. 
  • వివేకానందనగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ మాధవరం రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణతో కలిసి విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు.
  • నాగోలులోని పీఎంఆర్‌ కన్వెన్షన్‌లో నిర్వహించిన  రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. 150 మంది రక్త దానం చేశారు.  కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు. 
  • నాగారం 16వ వార్డు లక్ష్మీనగర్‌ ఫేస్‌-5 ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నేతలు రక్తదానం చేశారు.
  • భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ స్టేట్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు సికింద్రాబాద్‌లో రక్తదానం శిబిరం నిర్వహించారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌  రాష్ట్ర కార్యదర్శి మంచాల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 
  • సీఐడీ విభాగంలో ఓఎస్‌డీగా పనిచేస్తున్న మల్లారెడ్డి సోమవారం నిమ్స్‌ దవాఖానలోని బ్లడ్‌ బ్యాంక్‌లో ఆయన కుమారుడితో కలిసి రక్తదానం చేశారు. 
  • మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో ఎర్రగడ్డ డివిజన్‌ కల్యాణ్‌నగర్‌ వెంచర్‌-3 కాలనీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.logo