బుధవారం 03 జూన్ 2020
Telangana - May 04, 2020 , 13:32:33

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్ ‌: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో రక్తదాన శిబిరాన్ని  కార్మిక శాఖ మంత్రి మాల్లారెడ్డి ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ  ద్వి దశాబ్ది  కార్యక్రమంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని మంత్రి పేర్కొన్నారు. యువత రక్తదానం చేసేందుకు ముందుకొచ్చి ప్రాణదాతలుగా నిలువాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా రక్తదానం గొప్పదన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.


logo