సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 21:02:27

‘పేదలకు వరం సీఎం సహాయనిధి’

‘పేదలకు వరం సీఎం సహాయనిధి’

పెద్దపల్లి : సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిందని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో 18 మందికి సీఎం సహాయనిధి మంజూరైన రూ.3 లక్షల 90 వేల చెక్కులను సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానల్లో ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయనిధి దోహదం చేస్తున్నదని తెలిపారు. మానవతా దక్ఫథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సాయం అందిస్తున్నారని తెలిపారు. పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా ఉండగా ఉంటుందని చెప్పారు. సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.