మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 14:16:34

జ‌గ‌ద్గిరిగుట్ట‌లో ఆటోలో పేలుడు!

జ‌గ‌ద్గిరిగుట్ట‌లో ఆటోలో పేలుడు!

హైద‌రాబాద్‌: జ‌గ‌ద్గిరిగుట్ట‌లో భారీ పేలుడు క‌ల‌క‌లం సృష్టించింది. ఆటోలో ఒక్క‌సారిగా పేలుడు సంభ‌వించ‌డంతో స్థానికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. జ‌గ‌ద్గిరిగుట్ట ప‌రిధిలోని ఆస్బెస్టాస్ కాల‌నీలో శ‌నివారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఆటోలో పేలుడు జ‌రిగింద‌ని, ఆ స‌మ‌యంలో ఆటోలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పిందని పోలీసులు తెలిపారు. 

అయితే ఆటో డ్రైవ‌ర్ యూస‌ఫ్ అలీకి ఈ ప్ర‌మాదంలో తీవ్ర గాయాల‌య్యాయ‌ని చెప్పారు. గాయ‌ప‌డిన యూస‌ఫ్ అలీని పోలీసులు స్థానికుల సాయంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం పోలీసులు క్లూస్ టీమ్‌ను ర‌ప్పించి ఘ‌ట‌నా స్థ‌లంలో ఆధారాల‌ను సేక‌రించారు. కేసు న‌మోదు చేసి పేలుడుకుగ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ పేలుడులో ఆటో పూర్తిగా కాలిపోయింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.