బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 15:56:19

దుబ్బాక‌లో స్వ‌ల్ప మెజార్టీతో బీజేపీ విజ‌యం

దుబ్బాక‌లో స్వ‌ల్ప మెజార్టీతో బీజేపీ విజ‌యం

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితాల్లో బీజేపీ స్వ‌ల్ప మెజార్టీతో విజ‌యం సాధించింది. ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్, భార‌తీయ జ‌న‌తా పార్టీల మ‌ధ్య గ‌ట్టి పోటీ నెల‌కొంది. న‌రాలు తెగే ఉత్కంఠ మ‌ధ్య బీజేపీ గట్టెక్కింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి సోలిపేట సుజాత‌పై 1068 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు గెలుపొందారు. బీజేపీకి టీఆర్ఎస్  గ‌ట్టి పోటీనిచ్చింది. రెండో స్థానంలో టీఆర్ఎస్, మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. 

ఈ ఉప ఎన్నిక‌లో మొత్తం 1,64,186 ఓట్లు పోల‌వ్వ‌గా, బీజేపీకి 62,772, టీఆర్ఎస్ పార్టీకి 61,302, కాంగ్రెస్ పార్టీకి 21,819 ఓట్లు పోల‌య్యాయి.  పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1453 పోల‌వ్వ‌గా, అందులో 1381 ఓట్లు మాత్ర‌మే చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్ల‌లో టీఆర్ఎస్ పార్టీకి 720, బీజేపీకి 368, కాంగ్రెస్ పార్టీకి 142 ఓట్లు పోల‌య్యాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థి బండారు నాగ‌రాజుకు 60 ఓట్లు వ‌చ్చిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.