నాలుగు ఓట్లకోసం కక్కుర్తి పడుతున్న బీజేపీ: మంత్రి తలసాని

Nov 27, 2020 , 13:51:04

హైదరాబాద్‌: బీజేపీ మేనిఫెస్టోలో జీహెచ్‌ఎంసీకి సంబంధించిన అంశాలే లేవని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. కేవలం మూడు, నాలుగు అంశాలనే మేనిఫెస్టోలో చేర్చారన్నారు. దేవేంద్ర ఫడణవీస్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వరదలతో ముంబై అతలాకుతలం అయ్యిందని చెప్పారు. నాలుగు ఓట్లకోసం బీజేపీ నేతలు కక్కుర్తి పడుతున్నారన్నారు. బీజేపీ నేతలు బాధ్యత, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ మేనిఫెస్టోను ఇతర రాష్ట్రాల నేతలతో చదివిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత తమకు సంబంధంలేదని చెప్పడానికే బీజేపీ ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఏ సమస్యలు ఏ ప్రభుత్వం పరిధిలో ఉన్నాయో తెలియకుండా బీజేపీ వాగ్ధానాలు చేస్తున్నదని విమర్శించారు. ఎల్‌ఆర్‌ఎస్‌, పోలీస్‌, విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయన్నారు.

హైదరాబాద్‌కు వరదలొస్తే ప్రధాని పైసా సాయం చేయలేదని వెల్లడించారు. రేపు ప్రధానితో వరద బాధితులకు రూ.25 వేలు సాయం చేస్తామని జీవో ఇప్పించాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికే చేసిన, చేస్తున్న పనులనే భవిష్యత్‌లో చేస్తామని బీజేపీ వాగ్ధానాలు చేస్తున్నదని విమర్శించారు. విపత్తుల నిర్వహణ శాఖ కిషన్‌ రెడ్డి పరిధిలో ఉన్నప్పటికీ ఎలాంటి సాయం తీసుకురాలేదన్నారు. పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్లను ముట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదని చెప్పారు. రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ జరుగుతుందని సాయంత్రం 4 గంటలలోపు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD