శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 10:04:18

క‌ర్ణాట‌క‌లో బీజేపీ ముందంజ‌

క‌ర్ణాట‌క‌లో బీజేపీ ముందంజ‌

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో రెండు శాస‌న‌స‌భ స్థానాల‌కు న‌వంబ‌ర్ 3న ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆర్ఆర్ న‌గ‌ర్(రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్‌), సిరా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. ఆ రెండు స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ అభ్య‌ర్థులు ముందంజ‌లో ఉన్నారు. ఆర్ ఆర్ న‌గ‌ర్ నుంచి ఎన్ మునిర‌త్న బ‌రిలో ఉండ‌గా, సిరా నుంచి రాజేశ్ గౌడ పోటీలో ఉన్నారు. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు ఓట్ల లెక్కింపు చూస్తే.. మునిర‌త్న 9,950 ఓట్ల మెజార్టీతో లీడ్‌లో ఉండ‌గా, రాజేశ్ గౌడ 1,202 ఓట్ల మెజార్టీతో అధిక్యంలో ఉన్నారు. ఆర్ ఆర్ న‌గ‌ర్‌లో కాంగ్రెస్ రెండో స్థానంలో, జేడీఎస్ మూడో స్థానంలో ఉంది.