శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 16:23:37

టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ సీనియ‌ర్ నేత కొండ‌ప‌ల్లి మాద‌వ్‌

టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ సీనియ‌ర్ నేత కొండ‌ప‌ల్లి మాద‌వ్‌

హైద‌రాబాద్ : బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు కొండ‌ప‌ల్లి మాద‌వ్ నేడు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. న‌గ‌రంలోని అడిక్‌మెట్ డివిజ‌న్ నుంచి ఇత‌ర అనుచ‌రుల‌తో క‌లిసి నేడు ఆయ‌న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత స‌మ‌క్షంలో గులాబీ వ‌నంలో చేరారు. పార్టీ కండువా క‌ప్పి మాద‌వ్‌ను సాధ‌రంగా ఆహ్వానించారు క‌విత‌. మ‌న రాష్ర్టం, మ‌న ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డానికి క‌లిసి ప‌నిచేసేందుకు ఎదురు చూస్తున్న‌ట్లు క‌విత ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.